calender_icon.png 1 October, 2024 | 9:04 PM

అసహనంతోనే బీఆర్‌ఎస్ నేతలపై దాడులు

04-09-2024 04:05:00 AM

  1. సాయం చేయటం కాంగ్రెస్ లీడర్లకు చేతకాదు
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి):  కాంగ్రెస్ పార్టీ నేతలు అసహనానికి గురై బీఆర్‌ఎస్ నేతలపై గుండాలతో దాడి చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర మండిపడ్డారు. మంగళవారం తమ పార్టీ నేతలపై జరిగిన దాడిని ఎక్స్ వేదికగా ఆయన ఖండించారు. ప్రజలకు సాయం చేయటం కాంగ్రెస్ నేతలకు చేతకాదని, సాయం చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఆ పార్టీ నేతలు ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి అండగా ఉండ టమే తాము చేసిన తప్పా, ప్రజలకు సేవ చేయటం చేతకాదని, సేవ చేసే వాళ్లపై దాడి చేయటం సిగ్గు చేటుగా ఉందన్నారు.  ఈ దాడికి సీఎం సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమండ్ చేశారు. ఇలాంటి ఎన్ని దాడులు చేసినా ప్రజల వద్ద కు బీఆర్‌ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరన్నారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమన్నారు.

ఎస్‌ఎన్‌డీపీతో తప్పిన వరద ముప్పు 

హైదరాబాద్‌లో 2020 నాటి వరదల పరిస్థితి మళ్లీ రాకుండదని గత కేసీఆర్ ప్రభు త్వం ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 40 లక్షల మంది నివసించే పాతబస్తీలో ప్రత్యేకంగా నాలాలను బాగు చేయడం తో వరద ప్రభావిత ప్రాంతాలకు ముప్పు త ప్పిందని పేర్కొన్నారు. నీరు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా చేపట్టిన చర్యలతో  భారీ వర్షం పడినా ఓల్డ్ సిటీలో ఎలాంటి సమస్యలేదన్నారు.  నాలాల బాగుకోసం అవిశ్రా తంగా శ్రమించిన అప్పటి చీఫ్ ఇంజినీర్లు జియావుద్దీన్, కిషన్ నాయక్, వసంత , ఈఎన్సీ శ్రీధర్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. 

 గిరిజనులను కాపాడిన పోలీసులు.. 

అచ్చంపేటలోని డిండి కెనాల్‌లో చిక్కుకుపోయిన 10 మంది గిరిజనును కాపాడిన పోలీసులకు కేటీఆర్ అభినందనలు తెలిపా రు.  గిరిజనుల్లో ముగ్గురు చిన్నారులు, ఒక మహిళ ఉందన్నారు. దాదాపు మూడు రో జుల క్రితం వరదల్లో చిక్కుకుపోయిన గిరిజనులను రక్షించే విషయంలో కాంగ్రెస్ సర్కా ర్ అలసత్వం ప్రదర్శించిందన్నారు. సరైన సమయంలో హెలికాప్టర్లు తెప్పించి ఉంటే వారందరినీ ఒక్కరోజులోనే రక్షించగలిగే వారమని తెలిపారు. కానీ గిరిజనులను రక్షించేందుకు సీఎం ఎలాంటి ప్రయత్నం చేయ లేదని, పోలీసులే కష్టపడి వారిని రక్షించారని పేర్కొన్నారు. తెలంగాణలో వరద బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్ల అవసరం లేదని ప్రభుత్వం చెప్పడం సరికాద న్నారు.  ప్రజల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత లెక్క లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. ప్రజలు ఆపదలో ఉంటే ఈ ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు.

బుల్డోజర్ పాలిటిక్స్‌పై  సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నం..

ప్రభుత్వాలు చేస్తున్న బుల్డోజర్ పాలిటిక్స్ ప్రజల జీవితాలపై దాడి అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని  కేటీఆర్ పేర్కొన్నారు. సుప్రీం వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ తీరు మాత్రం ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఓ వైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆయన పెద్దపెద్ద మాటలు చెప్పారని ఎద్దేవా చేశారు. కానీ తెలంగాణలో తమ పార్టీ పాలనలో జరుగున్న విధ్వంసంపై మాత్రం ఆయన మౌనంగా ఉన్నారని, ఇదేమి ద్వంద్వ వైఖరి అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి బుల్డోజర్‌తో అన్యాయాలను కొనసాగిస్తుంటే ఆయన ఆపలేని శక్తిహీనుడిగా మారినట్లుగా ఉందన్నారు. ప్రజలను మోసం చేసే మీకు అలవాటైన డబుల్ స్టాండర్స్ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.