calender_icon.png 1 October, 2024 | 9:53 AM

బీఆర్‌ఎస్ నేతలపై దాడులు సిగ్గుచేటు

05-09-2024 01:38:07 AM

  1. సాయం చేసేందుకు వెళ్లడం నేరమా? 
  2. వరద బాధితులకు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ఒకరోజు వేతనం 
  3. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి, ప్రభుత్వం ఖమ్మంలో సాయం చేసేందుకు వెళ్లిన బీఆర్‌ఎస్ నాయకులపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సాయం చేసేందుకు వెళ్లడం నేరమా? అని ప్రశ్నించారు. అధిక వర్షాలకు ఖమ్మం ప్రజ లు ఇబ్బందులు పడుతుంటే అక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నా లాభం లేకపోయిందని మండిపడ్డారు. సిద్దిపేటలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. వరద బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.

బీఆర్‌ఎస్ అధినేత పిలుపు మేరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఒక నెల వేతనాన్ని వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రకటించారు. సిద్దిపేట నుంచి గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆరు లారీల్లో వంట సామగ్రి, నిత్యావసర వస్తువులను తరలించి, ఖమ్మానికి చెందిన వరద బాధితులకు అందిస్తామన్నారు. అనంతరం తన క్యాంప్ కార్యాలయం లో నియోజకవర్గస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలతో గ్రామాల్లో వాటిల్లిన నష్టాన్ని అంచనావేసి, బాధితులకు సాయం అందేలా చూడాలని ఆదేశించారు.