12 బస్సులపై కేసులు నమోదు...
రాజేంద్రనగర్ (విజయక్రాంతి): ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మూడవ రోజు రవాణాశాఖ అధికారుల దాడులు చేస్తున్నారు. శంషాబాద్ టోల్ ప్లాజా వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచి రంగారెడ్డి జిల్లా రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 12 బస్సులపై కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఉపరవాణా శాఖ అధికారి సదానందం ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆర్టిఏ అధికారులు వెల్లడించారు. ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రవేటు ట్రావెల్స్ యజమానులకు అధికారులు చెక్ పెడుతున్నారు. ఫైర్ సేఫ్టీ కిట్, ఫస్ట్ అయిడ్ బాక్స్, ఎమర్జన్సీ డోర్ బ్రేక్ హామర్ లేకుండా బస్సులు నడుస్తున్నట్లు గుర్తించారు. అదేవిదంగా డబుల్ డ్రైవర్ లేకుండా బస్సులను నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యాజమాన్యం ప్రయాణీకులతో పాటు అధిక లగేజ్ తరలిస్తున్న బస్సులపై సిరియస్ గా వ్యవహరిస్తున్నారు.