calender_icon.png 27 November, 2024 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీశాఖ అధికారుల దాడులు

27-11-2024 09:02:33 PM

అదుపులో ఇసుక ట్రాక్టర్స్

నిజామాబాద్ (విజయక్రాంతి): ఇసుక అక్రమ రవాణాపై రాత్రుల్లో గట్టి నిఘాపెట్టిన అటవీశాఖ సిబ్బంది అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. రాత్రుల్లో అక్రమంగా అటవీ ప్రాంతాల నుంచి నిబంధనలకు విరుద్దంగా అక్రమ ఇసుక రవాణాను చేస్తున్న వారిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. రాత్రుల్లో అక్రమంగా అటవీ ప్రాంతాల నుంచి నిబంధనలకు విరుద్దంగా అక్రమ ఇసుక రవాణాను చేస్తున్న వారిని అటవీ అధికారులు రాత్రుల్లో పట్టుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఈ దాడుల్లో ఆరు ట్రాక్టర్లను పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి రేంజ్ పరిధిలోని హాన్మాజివపేట్ కొట్టాల్‌పల్లి,సెక్షన్ పరిధిలోని బీట్‌లలో అక్రమంగా అటవీలో ప్రవేశించి అక్రమ ఇసుకను తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు ఎఫ్‌ఆర్‌వో రవి మోహన్ బట్ ఆదేశానుసారం మంగళవారం ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను సీజ్ చేసి ఇందల్‌వాయి అటవీ కార్యాలయానికి తరలించారు. ఈ దాడుల్లో అటవీ సెక్షన్ ఆపీసర్, బీట్ ఆఫీసర్లు రాములు, వంశీరాజ్, ప్రవీణ్, దిలిఫ్, పోషన్నలతో పాటు బేస్ క్యాంపు నిర్వహకులు గణేష్, ప్రణయ్, విలాస్, ప్రవీణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.