యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 15 (విజయక్రాంతి): భువనగిరి శివారులోని జాతీయ రహదారి పక్కనే ఉన్న వివేరా హోటల్‌లో సోమవారం వినియోగదారుడు బిర్యానీ ఆర్డర్ చేయగా, దానిలో జెర్రీ కనిపించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా ఫుడ్ సెఫ్టీ అధికారులు హోటల్‌లో దాడులు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటేడ్ అధికారి డాక్డర్ సుమన్ కల్యాణ్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి ఆధ్వర్యంలో సిబ్బంది షెడ్యూల్ 4 ప్రకారం సోదా చేశారు.
హోటల్ కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంతో యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. వివిధ రకాల ఆహార పదార్థాల నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. హోటల్ యాజమాన్యాలు కచ్చితంగా పాటించాల్సిందేనని ఫుడ్ సెఫ్టీ అధికారులు సూచించారు.