calender_icon.png 23 January, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాటుసారా స్థావరంపై ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు

22-01-2025 11:05:43 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలోని నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నార్నూర్ మండల కేంద్రంతో పాటు నాగుల్ కొండ గ్రామంలో బుధవారం ఎక్సైజ్ అధికారులు ముమ్మర  దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఆరు లీటర్ల నాటు సారా, 225 కేజీల నిషేధిత నల్లబెల్లం, 85 కిలోల పటిక, 3 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. దాడిలో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ సీఐ అక్బర్ హుస్సేన్ తెలిపారు. నాటుసారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో పలువురు ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.