calender_icon.png 14 November, 2024 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసులపై దాడి సరికాదు

13-11-2024 01:12:07 AM

నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల 

నిర్మల్, నవంబర్ ౧2 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని సాయిప్రియ ఆత్మహత్యకు పోలీసులే కారణమని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు విధుల్లో ఉన్న బాసర ఎస్సైపై దాడి చేయడం సరికాదని, దీనిపై విచారణ జరుపుతామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మంగళవారం నిర్మల్ జిల్లా పోలీసు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాసర ఎస్సైపై దాడిని నిరసిస్తూ ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థిని వ్యక్తిగత కారణాలతో చనిపోతున్నట్టు లేఖ రాసి, తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నా దానికి పోలీసులనే బాధ్యులంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడం పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బ తీస్తుందన్నారు.

బాసర ట్రిపుల్ ఐటీలో మృతదేహాన్ని ఉంచితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతోనే మృతదేహాన్ని భైంసాకు తరలించామని చెప్పారు. తల్లిదండ్రుల బాధను పోలీసులుగా అర్థం చేసుకుంటామని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులకు హామీ ఇచ్చారు. విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరుగుతుందని ఎస్పీ వెల్లడించారు. సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్టు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.