calender_icon.png 13 December, 2024 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీడియాపై దాడి సరికాదు

12-12-2024 01:21:14 AM

  • సినీ నటుడు మోహన్‌బాబుపై జర్నలిస్టుల ఆగ్రహం
  • రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు 
  • పలు ప్రాంతాల్లో పోలీసులకు ఫిర్యాదు

కరీంనగర్, డిసెంబరు 11 (విజయక్రాం తి): జర్నలిస్టుపై సినీనటుడు మోహన్‌బాబు దాడి చేయడాన్ని ఖండిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్(ఐజేయూ) ఆధ్వర్యంలో కరీంనగర్ ఎల్‌ఎండి వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. జిల్లా, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జర్నలిస్టులు ఆందో ళనలో పాల్గొనడంతో రాజీవ్ రహదారిపై వాహనాల రాకపోకలు గంటపాటు నిలిచిపోయాయి.

టీయూడబ్ల్యుజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ.. మోహన్‌బాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. 

ఆదిలాబాద్, నిర్మల్‌లో..

ఆదిలాబాద్/నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్‌లో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధులపై మోహన్‌బాబు దాడి చేయడం  సరి కాదన్నారకు. చర్యలు తీసుకోవాలని ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందించారు.

ఆదిలాబా ద్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసనలు వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టు జేఏసీ, టీయుడబ్ల్యుజే (ఐజేయు), టీయుడబ్ల్యుజే (హెచ్ టీయుడబ్ల్యుజేఎఫ్ జర్నలిస్టు సంఘాల ఆధర్యంలో నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ రాజరి షాను కలిసి వినతిపత్రం సమర్పించారు.  

ఖమ్మంలో..

ఖమ్మం(విజయక్రాంతి): టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఖమ్మం జిల్లా కమిటీ అధ్వ ర్యంలో ఖమ్మం నగరంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో యూ నియన్ జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా  అసోసియేషన్ అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్, స్తంభాద్రి జర్నలిస్టు హౌజింగ్  సొసైటీ అధ్యక్షుడు కనకం సైదులు, నాయకులు  పాల్గొన్నారు. 

నిజామాబాద్, కామారెడ్డిలో..

నిజామాబాద్/కామారెడ్డి(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీ న్విహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ధర్నాచౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అబిద్, ఆర్గనైజేషన్ సెక్రటరీ రజాక్, శ్రీకాంత్, రామేశ్వర్, ముదాం శంకర్ పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రెస్‌క్లబ్ వద్ద అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు.