calender_icon.png 13 December, 2024 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుపై దాడి సరికాదు

12-12-2024 01:23:04 AM

  1. నిందితులపై చర్యలు తీసుకుంటాం
  2. మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి):  నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడి వ్యక్తిగత పంచాయితీలో జర్నలిస్టుపై దాడికి దిగడం సరికాదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జర్నలిస్టులు ఈ అంశంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రిపోర్టర్ రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై కలెక్టర్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారని అన్నారు. దాడి ఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.