బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు
ప్రణాళికతోనే కాంగ్రెస్ నేతలు రాళ్లు, కోడిగుడ్లు, కర్రలు, ఇనుపరాడ్లు వెంట తీసుకొచ్చి, బీజేపీ కార్యాలయం వద్ద దాడులకు పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. దాడిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలను వారు గాయపరిచారన్నారు. దాడికి పూర్తిగా సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.