నాగర్‌కర్నూల్, నవంబర్ 22 (విజయక్రాంతి): అప్పుగా తీసుకున్న రూ.200 తిరిగి ఇవ్వలేదనే సాకుతో ఓ వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండి కుర్మయ్య అదే గ్రామానికి చెందిన గుండూరు శ్రీను వద్ద రూ.200 అప్పుగా తీసుకున్నాడు.
ఇదే అలుసుగా శ్రీను ఎప్పుడు పడితే అప్పుడు కుర్మయ్య ఇంటికి వెళ్లేవాడు. ఈ కోపంతో కర్మయ్య రూ.200 తిరిగి ఇచ్చేశాడు. దీన్ని మనుసులో పెట్టుకున్న శ్రీను శుక్రవారం తన సోదరుడితో కలసి కర్రలతో కర్మయ్యపై దాడికి దిగారు. సొమ్మసిల్లి పడిపోయిన కర్మయ్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.