calender_icon.png 18 January, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పు చెల్లించాలని అడిగినందుకు దాడి

18-01-2025 12:55:11 AM

* యువతి గొంతు కోసిన యువకుడు

నిర్మల్, జనవరి 17 (విజయక్రాంతి): ఇచ్చిన అప్పు తిరిగివ్వాలని అడినందుకు యువతిపై కత్తితో దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగింది. జిల్లా కేంద్రంలోని సోఫినగర్ కాలనీకి చెందిన దివ్య కుటుంబ సభ్యులు అదే కాలనీకి చెం  సంతోశ్ అనే యువకుడికి రూ.25 లక్షల వరకు అప్పు ఇచ్చారు. వాయిదా దాటడంతో దివ్య కుటుంబీకులు అప్పు చెల్లించాలని సంతోశ్‌పై ఒత్తిడి పెంచారు.

అయినా చెల్లించకపోవడంతో గత మూడు నెలల నుంచి సం  దివ్య కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్ర  గురువారం దివ్య తల్లి సంతోశ్‌ను నిలదీయండంతో సంతోశ్ కుటు  సభ్యులు దాడి చేశారు. ఆమెను శుక్రవారం ఆసుపత్రికి దివ్య తీసుకెళ్తుండగా కాపు కాసి ఉన్న సంతోశ్.. వెనుక నుంచి వెళ్లి దివ్య గొంతుపై సర్జికల్ బ్లేడుతో దాడి చేశాడు. తేరుకున్న దివ్య సంతోశ్‌ను పక్కకు నెట్టి పరుగు తీసింది. ఇది గమనించి స్థానికులు రావడంతో సంతోశ్ పరారయ్యాడు. దివ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. స్వల్ప గాయాలైనట్టు వైద్యులు తెలిపారు.