న్యూఢిల్లీ, అక్టోబర్ 23: హెచ్చరించిన నిమిషాల వ్యవధిలోనే లెబనాన్ రాజధాని బీరూట్ సమీపంలోని అపార్ట్‌మెంట్‌ను ఇజ్రాయెల్ బలగాలు నేలమట్టం చేశాయి. హెజ్బొ ల్లా, ఇజ్రాయెల్ మధ్య కొన్ని రోజులుగా డ్రోన్, క్షిపణి దాడులు జరు గుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీరుట్ దక్షిణాన ఉన్న రెండు నివాస భవనాలు, దాని చుట్టు పక్కల ఉన్న ఇళ్లపై క్షిపణి దాడులు చేయనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఇజ్రాయెల్ బలగాలు ప్రకటించాయి. అందులో నివాసం ఉండే పౌరులు ఖాళీ చేయాల్సిందిగా ప్రకటించి వెంటనే దాడి చేసింది.