calender_icon.png 15 January, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాట వింటలేడని కత్తితో దాడి

11-09-2024 02:00:15 AM

క్షణికావేశంలో తమ్ముడిని పొడిచిన అన్న 

హనుమకొండ, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తమ్ముడు మాట వినడం లేదని ఆగ్రహించిన అన్న  క్షణికావేశంలో కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం నర్సంపేటలో చోటుచేసుకుంది. నర్సంపేట పట్టణంలోని రాంనగర్ కాలనీకు చెందిన దొడ్డ దేవేందర్, దొడ్డ అమరేందర్ అన్నదమ్ములు. కొన్ని నెలల క్రితమే వీరి తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందారు. అన్నదమ్ములిద్దరూ దొరికిన పని చేసుకుంటూ కాలం వెళ్లదీసున్నా రు. ఈ క్రమంలో తమ్ముడు అమరేందర్ తన మాట వినడం లేదని దేవేందర్ మంగళవారం గొడవకు దిగాడు. క్షణికావేశానికి లోనైన దేవేందర్ కత్తితో దాడి చేయడంతో అమరేందర్‌కు పొట్ట భాగంలో బలమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం తో మెరుగైన చికిత్స కోసం వరంగ ల్ ఎంజీఎంలో చేర్పించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.