calender_icon.png 5 October, 2024 | 10:51 AM

దుకాణం తీయమన్నందుకు కత్తితో దాడి

05-10-2024 01:01:46 AM

ఖమ్మం, అక్టోబర్ 4 (విజయక్రాంతి): తన స్వీట్ దుకాణం ఎదుట ఉన్న పూల బండిని తీసివేయమన్నందుకు ఓ మాజీ ప్రజాప్ర తినిధి కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో దాడి చేశాడు. కొణిజర్ల మండ లం తనికెళ్ల సమీపంలోని తుమ్మలపల్లి క్రాస్ రోడ్డులో రామకృష్ణ స్వీట్ షాపును నిర్వహిస్తున్నాడు. ఆ షాపు ఎదుట ఓ మాజీ ప్రజాప్రతినిధికి చెందిన పూలబండి ఉన్నది. దాన్ని తీయమన్న ందుకు శుక్రవారం య జమానిపై మాజీ ప్రజాప్రతినిధి కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన రామకృష్ణ భార్య విజయలక్ష్మిపైనా దాడి చేయడంతో చేతి వేలు తెగిం ది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.