అవమానంతో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): విచక్షణా రహితంగా చితకబాది, వీ డియో తీసి బ్లాక్‌మెయిల్ చేయడంతో అవమానంగా భావించిన బాధిత యువకుడు ఆ త్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసి ల్ల జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో ని చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సూత్రం ఆంజనేయులు(22) వే ములవాడలోని ఓ దుకాణంలో పనిచేస్తూ కుటు ంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల స్వగ్రామంలో జరిగిన వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా మద్యంమత్తులో ఓ ఇంటిపై ట పాసులు విసిరాడు.
దీంతో ఆగ్రహం చెందిన సదరు ఇంటిలోని యువకులు, వారి స్నేహితులు ఆంజనే యులుపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ దృశ్యాలను వీడి యో తీసి బ్లాక్‌మెయిల్ చేశా రు. దీన్ని తీవ్ర అవమానం గా భావించిన ఆంజనేయులు గత వారం రోజులుగా ఇంటికి రాకుండా, ఇంట్లో వాళ్లకు, స్నేహితులకు దూరంగా ఉంటూ కాలం గడుపుతున్నాడు. ఈ క్రమం లో దాడి వార్త స్థానికంగా చర్చనీయాంశం గా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆంజనేయులు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న చందుర్తి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.