calender_icon.png 12 March, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాడికి పాల్పడ్డ నిందితుని రిమాండ్

11-03-2025 09:21:32 PM

మందమర్రి (విజయక్రాంతి): మద్యం మత్తులో తాగునీరు ఇవ్వలేదనే సాకుతో మహిళపై గొడ్డలితో దాడికి పాల్పడ్డ నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పట్టిన సీఐ కె శశిధర్ రెడ్డి  తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణం లోని పాత సీఎస్పి రోడ్డులో  నివాసముండే కుమార్ కొద్ది సంవత్సరాల క్రితం అనారోగ్యం బారిన పడీ ఆర్కే- 5 ఏరియా నస్పూర్ కాలనీకి కుటుంబంతో సహా వలస వెళ్ళాడు. నాలుగు రోజుల క్రితం పాత సీఎస్సీ రోడ్డులోని తన తల్లి ఇంటికి వచ్చి రోజు మద్యం సేవిస్తున్నాడు. సోమవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో అతిగా మద్యం సేవించి సమీపంలోని రాంబాయి ఇంటికి వెళ్లి త్రాగేందుకు నీరు కావాలని అడగగా రాంబాయి కుమారుడు రవికుమార్ తాగేందుకు నీరివ్వగా వాటిని తాగి వెళ్ళాడు. కాసేపటి తరువాత వచ్చి మళ్ళీ నీరు కావాలని అడగగా రాంబాయి నీళ్లు లేవని సమాదానం చెబుతూ ఖాళీ బిందెను చూపించింది.

దీనిపై ఆగ్రహం చెందిన నిందితుడు కావాలనే తాగేందుకు నీరు ఇవ్వడం లేదని గొడ్డలితో రాంబాయిపై దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న బాధితురాలి కుమారుడు రవికుమార్ బయటకు వచ్చే లోపల నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. దాడి సమాచారం పోలీసులకు అందించగా హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి బాధితురాలిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం వరంగల్ తలించారు. ఈ మేరకు బాధితురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తుండగా మంగళవారం జాతీయ రహదారి టోల్ గేట్ వద్ద పారిపోవడానికి సిద్ధంగా ఉన్న నిందితుడిని అదుపు లోకి తీసుకుని రిమాండ్ కు  తరలించినట్లు సిఐ శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్సై రాజశేఖర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.