కామారెడ్డి, అక్టోబర్ 14 (విజయక్రాంతి): మంత్రాల నెపంతో యువకుడిపై దాడి చేసిన ఘటన ఆదివారం అర్ధరాత్రి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అడ్లూర్ గ్రామానికి చెందిన గడ్డమీది సాయిలు తమకు మంత్రాలు చేస్తూ అనారోగ్యాల పాలు చేస్తున్నాడని కొందరు అనుమానిస్తూ అత నిపై దాడికి పాల్పడ్డారు.
గతంలో కూడా సాయిలుపై మంత్రాల నెప ంతోనే దాడి చేయగా అతను గ్రా మాన్ని వదిలి కామారెడ్డిలో నివా సం ఉంటూ మున్సిపాలిటీలో కా ర్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివా రం గ్రామంలోని ఇంటిలో ఉన్న సామగ్రిని తీసుకెళ్లెందుకు వెళ్లిన సాయిలుపై మళ్లీ మంత్రాలు చేస్తున్నాడని అనుమానిస్తూ గ్రామానికి చెందిన కొందరు దాడి చేశారు.
స మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సాయిలును ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ విషయమై బాధితుడి నుంచి ఎలా ంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.