యువకుడికి ఎనిమిదేళ్ల జైలుశిక్ష
వాషింగ్టన్, జనవరి 17: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌పై 2023లో ట్రక్కు నడుపుతూ వెళ్లి దాడికి యత్నించించిన భారత సంతతికి చెందిన యువకుడు కందుల సాయివర్షిత్‌కు అక్కడి న్యాయస్థానం ఎనిమిదేళ్ల జైలుశిక్ష విధించింది. యువకుడు నాజీ భావజాలంతో ఉన్నాడని, డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకే దాడికి యత్నించాడని, అవసరమైతే అధ్యక్షుడు జో బైడన్‌ను హతమా ర్చేందుకు సైతం యువకుడు సిద్ధమైనట్లు పేర్కొన్నది. ట్రక్కు దాడి కారణంతో వైట్‌హౌస్ ఆవరణలో మరమ్మతులకు 4,322 డాలర్లు ఖర్చయ్యాయని తెలిపింది.