calender_icon.png 14 November, 2024 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ ప్రోద్బలంతోనే అధికారులపై దాడి

13-11-2024 12:52:45 AM

సమావేశంలో మాట్లాడుతున్న యుగేందర్ గౌడ్

బీసీ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ యుగేందర్ గౌడ్

ముషీరాబాద్, నవంబర్ 12 : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రోద్బలంతోనే బీఆర్‌ఎస్ నాయకులు దాడి చేశారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ఆరోపించారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

లగచర్లలో అధికారులపై జరిగిన దాడి ముందస్తు పథకం ప్రకారమే చేసిన దాడిగా చూడాలన్నారు. దాడిచేసినవారి వెనుక ఉన్న పార్టీ పెద్దలను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్‌ఎస్ నాయకులు అష్టకష్టాలు పడుతున్నారని మండిపడ్డారు. దాడికి పాల్పడిని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వీవీ గౌడ్, నాయకులు.. సాయిబాబా, రాఘవేందర్, నగేష్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.