కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్
హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతిపై రాష్ట్రంలో దాడి జరుగుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేకపోవడంపై ఆయన మండిపడ్డారు. బతుకమ్మ తెలంగాణ పండుగే కాదని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వేడుకల్లో జానపదం కరువైందన్నారు.
వేములవాడలో మొక్కులు చెల్లించే కోడెలు కూడా మాయమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పండగల మీద ఆంక్షలు పెట్టడంపై ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ఆలయాలపై జరుగు తున్న దాడులు సర్కారుకు తెలియకుండానే జరుగుతున్నాయా? అన్న అనుమానం వ్యక్తం చేశారు.