న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 2: వ్యోమగాములు సునీత విలియమ్స్, బారీ విల్మోర్‌తో కూడిన బోయింగ్ స్టార్‌లైనర్ హీలియం లీకేజీతో ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో చిక్కుకొని పోగా.. తాజాగా స్టార్‌లైనర్ నుంచి వింత శబ్ధాలు వస్తున్నట్లు నాసా వెల్లడించింది. సునీతాతో పాటు స్టార్‌లైనర్‌లో చిక్కుకున్న విల్మోర్ ఈ విషయాన్ని నాసాకు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. నాసా సిబ్బంది మాట్లాడుతూ.. తాను స్టార్‌లైనర్ నుంచి ఏవో వింత శబ్దాలు విన్నానని.. లైవ్‌కాల్ ఏర్పాటు చేస్తే వినిపిస్తానని సందేశంలో విల్మోర్ తెలిపారు. లైవ్‌కాల్‌లో ‘మాకు స్టార్‌లైనర్ నుంచి నిజంగానే ఏవో వింత శబ్ధాలు వినిపించాయి. బహుశా అవి సోనార్‌పింగ్ లేదా ఎవరైనా స్పేస్ క్రాఫ్ట్ బయట నుంచి కొడుతున్నట్లు వచ్చిన శబ్ధాలు కావచ్చు’ అని తెలిపారు.
నాసా ప్రయత్నాలు ఫలించేనా?
ఈ ఏడాది జూన్ 5న సునీతా, విల్మోర్‌తో బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్షంలోకి వెళ్లగా ప్రొపల్షన్ వ్యవస్థలో సమస్యలు తలెత్తడంతో తిరుగు ప్రయాణంలో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. వారిని 2025 ఫిబ్రవరిలో తిరిగి తీసుకువచ్చేందుకు నాసా ప్రయ త్నాలు చేస్తోంది. ఇప్పటికే తిరుగు ప్రయాణం రెండుసార్లు వాయిదా పడగా.. ఇప్పుడు వారి స్సేస్‌క్రాఫ్ట్ నుంచి వింతశబ్ధాలు రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు సునీతా బతికే ఉందా? వారిని తిరిగి తీసుకువస్తామంటున్న నాసా శాస్త్రవేత్తల మాటలను నమ్మవచ్చా? అనే ప్రశ్నలు వినిపిసున్నాయి.