05-04-2025 10:21:52 AM
హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో ఒక రౌడీ షీటర్(Rowdy sheeter)పై శుక్రవారం రాత్రి కొంతమంది వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్(Rajendranagar Police Station)లో అనేక కేసులు నమోదైన రౌడీ షీటర్ భరత్, ఒక చిన్న విషయానికి వాగ్వాదానికి దిగి పుష్ కార్ట్ విక్రేతలపై దాడి చేశాడు.
అంతటితో ఆగకుండా వాళ్ల దుకాణాలను ధ్వంసం చేశాడు. అతను దుర్భాషలాడి కనీసం 10 మందిపై దాడి చేశాడు. దీంతో తిరగబడిన పుష్ కార్ట్ విక్రేతలు(Push cart vendors) అతనిపై దాడి చేసి పొట్టు పొట్టు కొట్టారు. ఈ దాడిలో భరత్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.