10-04-2025 10:27:13 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణ శివారులోని అన్నపూర్ణ లాడ్జి రూమ్ లో గురువారం రాత్రి పేకాట స్థావరంపై టౌన్ సిఐ తిరుమల గౌడ్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. సిఐ తెలిపిన వివరాల ప్రకారం.. 8 మంది పేకాడుతుండగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 16 వేల 710 రూపాయలు, పేక ముక్కలు సీజ్ చేసి స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ లో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.