రాజేంద్రనగర్, నవంబర్ 9: శంషాబాద్ మండలంలో ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల పట్టణంలోని ఎయిర్‌పోర్టు కాలనీలోని హనుమాన్ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు నవగ్ర హ విగ్రహాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. తదనంతరం శుక్రవారం అదే ఆలయంలో త్రిశూలాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు.
తాజాగా శంషాబాద్ మండల పరిధిలోని జూకల్‌లో శనివారం రాత్రి పోచమ్మ ఆలయంలో దుండగులు అమ్మవారి కన్నును తొలగించారు. అమ్మవారి విగ్రహంపై ఉన్న చీరను బయట పడేశారు. కొద్దిసేపటి తర్వాత గమనించిన గ్రామస్తులు ఓ అనుమానితుడిని పట్టుకొని పోలీసులు అప్పజెప్పారు.
హిందూ ఆలయాలపై వరుస దాడులతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. జూకల్‌లో ఘటన జరిగిన తర్వాత శనివారం రాత్రి భక్తులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.