మేడ్చల్, అక్టోబర్ 7: ఈఎంఐ చెల్లించలేదని వ్యక్తిపై దాడి చేసిన ఘటన మేడ్చల్‌లో చోటుచేసుకుంది. భద్రాచలానికి చెందిన ఉదయ్ మేడ్చల్‌లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఆదిత్య బైక్ జోన్‌లో వాయిదా పద్ధతిలో బైక్ కొనుగోలు చేసి నాలుగు ఈఎంఐలు చెల్లించలేదు. కాగా, ఉదయ్ తల్లి యశోద 16 రోజుల క్రితం అనారోగ్యానికి గురికాగా సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఉదయ్ అక్కడే ఉండి తల్లికి చికిత్స చేయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యజమాని సోమవారం ఉదయం అక్కడకు చేరుకొని ఉదయ్‌ను బయటకు తీసుకొచ్చి చితకబాదాడు. తన తల్లికి సీరియస్‌గా ఉందని చెప్పినా వినిపించుకోలేదు. కాగా, ఈ క్రమంలోనే తల్లి సాయంత్రం కన్నుమూసింది. తల్లికి సీరియస్‌గా ఉందని చెప్పినా మానకర్కశంగా వ్యవహరించాడు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.