calender_icon.png 15 January, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు

10-09-2024 04:07:03 AM

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి 

నల్లగొండ, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పై అనర్హత వేటు తథ్యమని మాజీ మంత్రి జ గదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్ర ంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కాళోజీ జయంతిలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్ ద్రోహులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. త్వరలో ఫిరాయింపు స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని, ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించబోతున్నదని జోస్యం చెప్పారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ బ్రాండ్‌ను దెబ్బతీసేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవవహరిస్తున్నారని మండిపడ్డారు.