చేవెళ్ళ, (విజయక్రాంతి): చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై స్వంత పార్టీ నేతలు కోడిగుడ్లు, టమాటలతో దాడికి దిగారు. బుధవారం షాబాద్ మండలంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్ ల పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే రాగ ఘటన చోటు చేసుకుంది. 10 ఏళ్ల నుండి కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులని, కార్యకర్తలని గుర్తించాలని డిమాండ్ చేశారు. గత పది ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారిని గుర్తించకుండా.. బిఆర్ఎస్ నుండి వచ్చిన వారిని వెంట వేసుకొని తిరుగుతున్నారని ఆగ్రహంతో.. ధర్నా చేసి గో బ్యాక్ ఎమ్మెల్యే,గో బ్యాక్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. మాకు న్యాయం చేసే అంత వరకు మేము వినేదిలేదంటూ.. మొండిగా డౌన్ డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేయడం జరిగింది. పోలీసులు నిరసనకు దిగిన పార్టీ నేతలు, కార్యాకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరము ఎమ్మెల్యే ఒక్కడే కార్యలయం కు వెళ్లి చెక్ లను పంపిణి చేసి వెళ్లి పోయారు.