calender_icon.png 10 March, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాలల అస్థిత్వంపై దాడి దుర్మార్గం

07-03-2025 12:10:27 AM

చేవెళ్ల , మార్చి 6: చేవెళ్ల మండల కేంద్రంలోని రంగారెడ్డి జిల్లా మాల సంఘాల జేఏసీ  ఆధ్వర్యంలో సమావేశమయ్యరు. మాలలపై జరుగుతున్న కుట్రలను, జాతిఉనికి, వర్గీకరణ ముసుగులో  మాలలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండింస్తున్నామన్నారు.

ఎస్సీ వర్గీకరణ ముసుగులో మాలలను ద్రోహులుగా, దోషులుగా చిత్రీకరించటం సరికాదని మాలలది స్వయం కృషితో బ్రతికే తత్వమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగాల పోరాటాల ద్వారా వచ్చిన రిజర్వేషన్ల అవకాశాలను అందిపుచ్చుకోవడమే తప్పు చేసినట్లుగా సమాజానికి చెప్పడం దుర్మార్గం,దురదృష్టకరమన్నారు.

వేల సంవత్సరాలుగా అంటరానితనంతో అల్లాడుతున్న మాలలపై పాటల, రచనల రూపంలో దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా మాలల్లోని మేధావులు, రాజకీయ నాయకులు, ఉద్యమకారులు, విద్యార్థులు మేల్కొని మాలల అస్థిత్వంకై పోరాడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతం పెంచాలని డిమాండ్ కోరారు.

ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్పుల మల్లేష్, మాల మహానాడు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేష్, సమతా సైనిక్ దల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాచన్ పల్లి రామస్వామి, ఆల్ ఇండియా  అంబేద్కర్ సంఘం నాయకులు  మల్లెపల్లి శ్రీనివాస్, సత్యం, బురాన్ మహేష్, బేగరి సంజీవ తదితరులు పాల్గొన్నారు.