calender_icon.png 23 January, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టు, విద్యార్థులపై దాడి అన్యాయం

12-07-2024 02:43:29 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్టు, ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దాడి చేసిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎస్‌ఎఫ్ ఓయూ కార్యదర్శి నెల్లి సత్య డిమాండ్ చేశారు. పోలీసులు చేసిన ఈ భౌతిక దాడిని ఖండిస్తున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.  ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఈ దాడిపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.