* బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి శ్రీనివాస్
రంగారెడ్డి, డిసెంబర్ 29 (విజయక్రాంతి) : మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలోని జెడ్పీ హైస్కూల్ జీహెచ్‌ఎం రాములుపై దాడికి పాల్పడడిన వారిపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయ్యప్పమాల ధరించిన విద్యార్థిని జీహెచ్‌ఎం అవమానించారనే అపవాదను కొందరు కుట్రపూరితంగానే మోపారని ఆరోపించారు.
దీనిని అవకాశంగా తీసుకొని అయ్యప్పభక్తుల ముసుగులో కొందరు వందలాదిగా పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడటాన్ని ఆయన ఖండించారు. తరగతిగదిలో అనుకోకుండా జరిగిన ఘటనకు ఆయన చింతించి క్షమాపణ కోరినా దాడికి పాల్పడటం సిగ్గుచేటన్నారు. సదరు ఉపాధ్యాయుడు దళితుడు కాబట్టే ఆయనపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటనపై రాచకొండ సీపీ విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాం డ్ చేశారు. లేని పక్షంలో బీఎస్పీ తరఫున జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.