calender_icon.png 31 October, 2024 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యుల దాడి

06-07-2024 12:00:00 AM

కోఠి డీఎంఈ కార్యాలయంలో ఘటన

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యులే దాడి చేసిన ఘటన కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద జరిగింది. దీంతో దాడికి గురైన శేఖర్ డీఎంఈ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సా ధారణ బదిలీలను అడ్డుకునేందుకు పలువురు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వైద్యసం ఘం ముసుగులో కొందరు ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్‌లోనే తిష్ట వేశారని ఆరోపించారు. తాను డీఎంఈకి వినతిపత్రం ఇవ్వకుండా తనను అ డ్డుకుని దాడి చేశారని ఆరోపించా రు. దాడికి పాల్పడిన వైద్యులు పల్లం ప్రవీణ్‌కుమార్, బొంగు రమేష్, రాథోడ్, వినోద్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.