calender_icon.png 15 November, 2024 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీశాఖ అధికారులపై దాడి

14-11-2024 12:18:10 AM

  1. అటవీ భూమి చదును చేస్తుండగా అడ్డుకున్న అధికారులు 
  2. దాడికి దిగిన భూకబ్జాదారులు

కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): అటవీ అధికారులపై భూకబ్జా దారులు దాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరి పల్లిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. రత్నగిరిపల్లి బీట్ పరిధిలో కొందరు అక్రమంగా అటవీ భూమిని ట్రాక్టర్లతో చదు ను చేస్తున్నారని సమాచారం రావడంతో మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారి రమేశ్ తన సిబ్బందితో కలిసి వెళ్లారు.

చదును చేయవద్దని అధికారులు సముదాయించినా భూ కబ్జాదారులు వినకుండా అధికారులపై దాడులకు పాల్పడ్డారు. కొంతమంది వ్యక్తు లు మైసమ్మ చెరువు వద్ద కాపు కాసి జీపులో ఉన్న అధికారులను బయటకు లాగి కొట్టా రు. ఈ దాడిలో డిప్యూటీ రేంజ్ అధికారి రమేశ్, బీటీ ఆఫీసర్ నాగరాజు, బేస్ క్యాంప్ ఆఫీసర్ మోహన్ గాయపడ్డారు.

దాడి చేసిన వ్యక్తులపై మాచారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రమేశ్ ఫిర్యాదు చేశారు. రత్నగిరిపల్లికి చెందిన కుంచం లింగం, బోదాస్ సురేశ్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు.