calender_icon.png 24 November, 2024 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ అధికారులపై దాడి

28-09-2024 12:38:49 AM

అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న అధికారులు

హనుమకొండ, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): అటవీ భూమిని కొందరు చదును చేస్తుండగా అడ్డుకున్న అటవీ శాఖ అధికారులపై దాడులకు తెగబడ్డారు. చేతికందిన రా ళ్లు, ఇనుప రాడ్‌లతో విరుచుకుపడటంతో ఫారెస్ట్ ఆఫీసర్లకు తీవ్ర గాయాలయ్యాయి.

ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామరవాయి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు అటవీ భూమిని చదును చేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎఫ్‌ఎస్‌వో వినోద్‌కుమార్, ఎఫ్‌బీవోలు శరత్‌చంద్ర, సమన్, బేస్ క్యాంపు ఉద్యోగి ఎట్టి శ్రీను, డ్రైవర్ రాజేందర్ అక్కడికి వెళ్లారు. అప్పటికే చదును పనులు పూర్తి చేసుకుని తమకు ఎదురుగా వస్తున్న జేసీబీ ని అధికారులు అడ్డుకున్నారు.

జేసీబీని అట వీ శాఖ కార్యాలయానికి తీసుకెళ్తుండగా ఐ దుగురు దాడులకు పాల్పడ్డారు. అధికారుల పై రాళ్లు రువ్వడంతో పాటు ఇనుప రాడ్లతో దాడులు చేశారు. అటవీ శాఖ జీపు అద్దాల ను పగులగొట్టి విధ్వంసం సృష్టించారు.

ఈ దాడిలో ఎఫ్‌ఎస్‌వో వినోద్‌కుమార్ తలకు తీవ్ర గాయం కాగా ఎఫ్‌బీవో శరత్‌చంద్ర చే తి వేళ్లు విరిగాయి. వీరు వరంగల్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. దాడి కి పాల్పడిన గంటా సూరజ్‌రెడ్డి, గంట శశిధర్, పాండవుల సాయి, నీరటి శ్రీకాంత్, మాధరి చంటిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి కొండా సురేఖ 

వరంగల్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎఫ్‌ఎస్‌వో వినోద్‌కుమార్, ఎఫ్‌బీవో శరత్‌చంద్రను శుక్రవారం మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాడి ఘటనపై ఆరా తీశారు. అటవీ అధికారులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.