25-03-2025 11:12:02 PM
ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి కుటుంబంపై అమ్మాయి తరపువారు దాడి చేసిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన అచ్చన మహేష్, అదే గ్రామానికి చెందిన చేగురి కావ్యశ్రీ ఇద్దరు రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహం ఇష్టంలేని అమ్మాయి తరపువారు మంగళవారం ఉదయం అచ్చన మహేష్ ఇంట్లోకి ప్రవేశించి తన అక్క మౌనికపై దాడి చేశారు. మౌనిక ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.