calender_icon.png 22 September, 2024 | 7:06 PM

డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడి.. సభ్య సమాజం తలదించుకునే ఘటన

22-09-2024 04:39:54 PM

భువనగిరి మున్సిపల్ మాజీ ఛైర్మన్ బర్రె జహంగీర్

యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో సామాజిక న్యాయ శిల్పంమైన మహనీయ డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిని ఖండిస్తు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఇటుకల దేవేందర్ మాదిగ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. నల్ల జండాలతో నిరసన వ్యక్తం చేసిన అనంతరం భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ మాట్లాడుతూ... భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాంపై దాడి సభ్య సమాజం తలదించుకునే ఘటన అని ఆయన పేర్కొన్నారు. 

దాడి చేసి దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చట్టాలు నమోదు చేసి తీవ్రంగా  శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. మహనీయ డా.బీఆర్ అంబేద్కర్ ప్రపంచం మేధావి గా సమాజంలో అన్నీ వర్గాల శ్రేయస్సు కోరి భారత రాజ్యాంగాన్ని అందించాడని అటువంటి మహనీయుని జీవిత చరిత్ర తెలుకోకుండా ఆయన సమాజం కోసం చేసిన త్యాగాలు, పోరాటాలు తెలియకుండా మహనీయుని పై అపోహలతో, కుట్రతో విగ్రహంపై దాడులకు పాల్పడటం అవివేకం .మహనీయ డా.బీఆర్ అంబేద్కర్ బాటలో నడువడం మనవాళి ప్రగతి కి బాటలు వేస్తుంది మానవ సమాజం వికసిస్తుంది.

డా.బీఆర్ అంబేద్కర్ ఐడియాలాజీ అర్ధం చేసుకొని సమ సమాజ స్థాపనకు ముందుకు ప్రతి ఒక్కరు సాగాలని, భీమనపల్లిలో దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలనీ ఇటువంటి దుశ్చర్య లకు ఎవరు పాల్పడుకుండా మహానీయుల విగ్రహాల వద్ద నాణ్యమైన సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి ఇటువంటి సమాజ విద్రోహ సంఘటన లకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డ్ కౌన్సిలర్ ఈరపక నర్సింహ దర్గాయి, హరిప్రసాద్, సిర్పంగా శివలింగం, ఇటుకల దేవేందర్, ఆనంపట్ల కృష్ణ, బర్రె సుదర్శన్, కాంచపల్లి నర్సింగ్ రావు, డాకురి ప్రకాష్, బండారు బల్ నర్సింహ, కోళ్ల కృష్ణ జయరావులు తదితరులు పాల్గొన్నారు.