హైదరాబాద్, నవంబర్ 11(విజయక్రాంతి): వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డిపై జరిగిన దాడిని తెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం.హుస్సేని ముజీబ్ ఖండించారు. ఈమేరకు సోమవారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. దాడికి నిరనసగా మంగళవారం ఆ జిల్లా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని వెల్లడించారు.