ములకలపల్లి, జనవరి 2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలంలోని నల్లముడిలో పోలీసులు కోడి పందెల స్థావరాలపై పోలీసులు దాడిచేశారు. స్థానిక ఎస్‌ఐ కిన్నెర రాజశేఖర్ తెలిపిన సమాచారం మేరకు నల్లముడిలోని కోడిపందేల స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు.
దాడుల్లో నలుగురు పట్టుబడగా వారిపై కేసు నమోదు చేసి, రూ.3,070 నగదు, 3 సెల్‌ఫోన్లు, రెండు కోడి పుంజులు, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.