ఇల్లెందు, జనవరి 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మం బోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మొట్లగూడెం గ్రామ శివారులో కోడి పందేల స్థావరంపై సోమవారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.59 వేల నగదు, 18 కోళ్లు, 8 ఫోన్లు, 16 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. బోడు ఎస్సై శ్రీకాంత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.