03-04-2025 01:42:00 AM
రాజేంద్రనగర్, ఏప్రిల్ 2: చిత్రగుప్త యూ ట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు దారమోని గిరీష్‌పై బీజేపీ నాయకులు, కార్యకర్తలు దా డి చేశారు. దారమోని గిరీష్ గతంలో బీజేపీ నాయకుడు. కొన్నిరోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద అనుచిత, అభ్యంతరకర వీడియోలు చేశాడని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
మంగళవారం రాత్రి అత్తాపూర్ ఈశ్వర్ థియేటర్ సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లోకి బీజేపీ మహిళా కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని దారమోని గిరీష్‌ను రక్షించే యత్నం చేశారు.
ఈ క్రమంలో పోలీసులను కూ డా అడ్డుకొని దాడులు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేర కు పోలీసులు 45 మందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.