calender_icon.png 15 October, 2024 | 2:43 PM

Breaking News

కెనడా దౌత్యవేత్తలపై వేటు

15-10-2024 02:13:47 AM

  1. భారత్ విడిచి వెళ్లిపోవాలంటూ ఆరుగురికి కేంద్రం ఆదేశం
  2. నిజ్జర్ హత్యకేసులో భారత దౌత్యవేత్యలపై కెనడా చేసిన ఆరోపణలపై ఆగ్రహం

ఒట్టావా, అక్టోబర్ 14: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యకేసులో కెనడా చర్యలను తీవ్రంగా పరిగణిస్తోన్న భారత్ అదే స్థాయిలో స్పందించింది. ఆరుగురు కెనడా దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు వేసింది. అక్టోబర్ ౧౯ అర్ధరాత్రి ౧౦ గంటల్లోపు భారత్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్‌వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను ‘పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు’గా కెనడా పేర్కొంది. హత్య కేసులో కెనడా ప్రభుత్వం ఆయన పేరును అనుమానితుల జాబితాలో చేర్చింది. దీనిపై భారత్ అభ్యం తరం వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్త స్టీవర్ వీలర్‌కు సమన్లు జారీచేసింది. 

కెనడా ప్రభుత్వం ఓటు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. ట్రూడోకు భారత్ పట్ల విద్వేష భావం ఉందని తన ప్రకటనలో పేర్కొంది. భారత్ వ్యతిరేక తీవ్రవాద, వేర్పాటువాద ఎజెండాలతో సంబంధం ఉన్న వ్యక్తులను తన క్యాబినెట్‌లో చేర్చుకున్నారని విమర్శించింది.

భారత దౌత్య సిబ్బందికి కెనడాలో రక్షణ లేదని, అందుకే కెనడా నుంచి భారత హైకమిషనర్‌ను వెనక్కుపిలిపించినట్లు స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయంతో హైకమిషనర్‌తో పాటు ఇతర సిబ్బంది కూడా భారత్‌కు రానున్నారు. కెనడాలో హత్య సమయంలోనూ గురైన తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దీని వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉందని ఆరోపించించారు. ఆయన ఆరోపణలను వెంటనే భారత ప్రభుత్వం తిప్పికొట్టింది.