calender_icon.png 18 January, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీగాంలో బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి

17-01-2025 05:56:55 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): కన్నెపల్లి మండలం వీగాం గ్రామపంచాయతీలో గురువారం ఉదయం వాకింగ్ కు వెళ్లిన బీఆర్ఎస్ కార్యకర్త జిల్లపల్లి విఘ్నేష్ పై గ్రామానికి చెందిన కొంతమంది కర్రలతో దాడికి పాల్పడ్డారు. అదే సమయంలో గ్రామస్తులు చూడడంతో వారు పరారయ్యారు. తీవ్రగాయాల పాలైన జిల్లపల్లి విఘ్నేష్ ను కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జిల్లపల్లి విఘ్నేష్ రాజకీయ కక్షలతోనే తన పాలోళ్లైన జిల్లపల్లి మల్లేష్, జిల్లపల్లి శ్రీను, జిల్లపల్లి లక్ష్మీనారాయణ, జిల్లపల్లి నాని, జిల్లపల్లి లిటిల్, జిల్లపల్లి బబ్బి లు కర్రలతో తనపై దాడి చేశారని తెలిపారు. వీరి వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని అధికారులను వేడుకున్నారు.