అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 13: నిబంధనలు మేరకు పనులు చేయాలని చెప్పినందుకు గాను బిల్ కలెక్టర్ (కారోబార్)పై మాజీ సర్పంచ్ దాడి చేసిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, గండిచెరువు గ్రామ పరిధిలోని విష్ణుప్రియ, శివప్రియ వెంచర్ లో ఉన్న ఒక వివాదస్పద స్థలంలో బోరు వేస్తున్నారని గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి సమాచారం అందించడంతో బిల్ కలెక్టర్ అనుపట్టి గిరీశ్, వాటర్‌మెన్లతో కలిసి వెళ్లగా.. అక్కడ ఉన్న మాజీ సర్పంచ్ జక్కా పాపిరెడ్డి, మరో వ్యక్తి జక్కా ధీరజ్‌రెడ్డి వారిపై దాడిచేశారు. ఈ విషయంపై బాధితుడు పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.