- కుర్చీలు, టీవీ ఇతర సామగ్రి ధ్వంసం
- సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతల అనుచిత వ్యాఖ్యలకు ప్రతిగా దాడి
- ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టు
నల్లగొండ , జనవరి 11 (విజయక్రాంతి): యాదాద్రి భువ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై శనివారం ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృ శనివారం మీడిమాతో మాట్లాడుతూ సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలకు ప్రతిదాడిగా కాంగ్రెస్ కార్యకర్తలు.. జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడిచేయడంతో పాటు ఫర్నీచర్, టీవీ ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు.
కాగోడకున్న మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రపటాలను బయటకు విసిరేశారు. అనంతరం కార్యాయలం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాం కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుక్ను బీఆర్‌ఎస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకొని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డు య్నురు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసనతెలిపారు.
దాడిని ఖండించిన బీఆర్‌ఎస్ నేతలు
హైదరాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపైన కాం కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ మాజీమంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత తెలిపారు. శనివారం ఎక్స్ వేదికగా వారు స్పందించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పారీక్టి అలవాటుగా మారిందని మండిపడ్డారు. దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులు పునరావృతమైతే ఊరుకునేది లేదన్నారు. భౌతికదాడులతో గులాబీ సైనికులను భయపెట్టలేరని.. ఈదాడిని పిరికపంద చర్యగా వారు అభివర్ణించారు.