25-02-2025 02:24:20 AM
ఢాకా, ఫిబ్రవరి 24: బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ జిల్లాలోని వైమానిక స్థా వరంపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు స్థానిక వ్యాపారి షిహాన్ కబీర్ (30)గా గుర్తించారు.
వైమానిక స్థావరంపై దాడిలో కబీర్ మృతి చెందడం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. వారంతా వైమానిక దళ స్టేషన్‌లోకి చొరబడేందుకు యత్నించడం వీడియోల్లో రికార్డయ్యాయి. అనుమతి లేకుండా చొరబడడంతోనే ఎదురుదాడికి దిగినట్లు భద్రతా సిబ్బంది తెలిపింది.