బంగ్లాదేశ్ పరిణామాలు అమెరికాలోని ఆ దేశ పౌరులపై ప్రభావం చూపాయి. న్యూయార్క్‌లోని బంగ్లాదేశ్ కాన్సులేట్‌పై నిరసనకారులు దాడికి దిగారు. రాయబార కార్యాలయం లోపలికి ప్రవేశించి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కాన్సులేట్‌లోని గోడపై ఉన్న హసీనా తండ్రి, బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రపటాన్ని తొలగించి ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో కాన్సుల్ జనరల్ నజ్ముల్ హుదాతో నిరసనకారులు వాదనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.