25-03-2025 12:21:02 AM
కొనసాగుతున్న విచారణ..
విజయక్రాంతి కథనానికి ఎఫెక్ట్
భద్రాద్రి కొత్తగూడెం మార్చి 24 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుల్ లను పనిష్మెంట్ కింద ఇతర పోలీస్ స్టేషన్లకు అటాచ్మెంట్ చేస్తూ ఇల్లందు డిఎస్పి చర్యలు తీసుకున్నారు. ఈనెల 19న విజయ క్రాంతిలో ప్రచురితమైన రాత్రివేళ పోలీసుల హల్ చల్ కథనానికి స్పందించిన డీఎస్పీ చంద్రభాను విచారణ చేపట్టారు.
టేకులపల్లి నుంచి రాగబోపోయినాగూడెం వెళ్లే మార్గంలో ఈనెల 18న తెల్లవారుజామున టేకులపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు హల్ చల్ సృ ష్టించారు. ఆ మార్గంలో వెళ్తున్న ఓ వాహనాన్ని అడ్డగించి కారు తాళాలు, సెల్ ఫోన్ లాక్కొని రూ:20వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ 10వేలు ఇస్తే తాళాలు ఇవ్వడం జరిగింది.
జరిగిన సంఘటనను బాధితుడు టేకులపల్లి కి చెందిన ధరావత్ జితేందర్ టేకులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఫిర్యాదు స్వీకరించిన ఇల్లందు డీఎస్పీ హల్ చల్ చేసిన ఇద్దరు కానిస్టేబుల్లను ఇతర ప్రాంతాలకు అటాచ్మెంట్ చేయటం జరిగిందని,వారిపై విచారణ కొనసాగుతోందని ఇల్లందు డిఎస్పి తెలిపారు