calender_icon.png 11 January, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్రలో దారుణం

30-07-2024 12:03:58 AM

  1. మహిళను అడవిలో చెట్టుకు కట్టేసి పారిపోయిన భర్త
  2. పాస్‌పోర్ట్ ఆధారంగా అమెరికన్ మహిళగా గుర్తింపు

ముంబై, జూలై 29 : మహారాష్ట్రలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను అడవిలో చెట్టుకు గొలుసులతో కట్టేసి వెళ్లిపోయాడు ఆమె భర్త. అటువైపుగా వెళ్లిన ఓ గొర్రెల కాపరి ఆమె ఆర్తనాదాలు విని అక్కడికి వెళ్లాడు. ఆమె దీనస్థితి చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మహారాష్ట్ర సింధుదుర్గ్ అటవీ ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. బాధిత మహిళలను 50 ఏళ్ల లలితా కయీ కుమార్‌గా గుర్తించారు. ఆమె దగ్గర తమిళనాడు చిరునామాతో ఆధార్ కార్డు, అమెరికా పాస్‌పోర్టు కాపీ, ఇతర పత్రాలను కనుగొన్నారు. ఆమె ఏ దేశానికి చెందిన వారనే విషయాన్ని ధ్రువీకరించేందుకు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ను సంప్రదిస్తున్నామని తెలిపారు.  

అమెరికా పౌరురాలిగా గుర్తింపు..

తొలుత మహిళను సావంత్‌వాడి (కొంకణ్)లోని ఆసుపత్రికి, ఆపై సింధుదుర్గ్‌లోని ఓరోస్ ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఆమె మానసిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని, మెరుగైన చికిత్స కోసం గోవా మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ, మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు వివరించారు. అయితే, ఇప్పటికే ఆమె వీసా గడువు ముగిసిందని, ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వారితో సంప్రదిస్తున్నామని, ఆమె అమెరికా పౌరురాలిగా గుర్తించినట్లు చెప్పారు. ఆమె భర్తతో గొడవ పడటంతో అడవిలో బంధించినట్లు భావిస్తున్నారు.