calender_icon.png 15 November, 2024 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలి

13-11-2024 01:25:31 AM

ఖమ్మంలో మాట్లాడుతున్న బక్కి వెంకటయ్య

  1. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
  2. ఖమ్మం, కొత్తగూడెం అధికారులతో సమావేశాలు

ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 12 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నెల రోజుల్లో పరిష్కరించి వాటి నివేదిక అందజేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో ల్యాండ్, అట్రాసిటీ సమస్యలపై వేర్వేరుగా స మావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు జిల్లాల్లో ఇప్పటి వరకు ఎన్ని అట్రాసిటీ కేసులు పరిష్కరించారు, ఎంతమంది బాధితులకు పరిహారం అందించారని జిల్లా సంక్షేమ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఎస్సీ, ఎస్టీ  కేసుల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు తప్పకుండా నిర్వహించాలని ఆదేశించా రు. ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీల భూ సంబంధిత కేసుల పరిష్కారానికి అవసరమైన నివేదికలు తెప్పించు కోవాలని, వాటిని నెల రోజుల వ్యవధిలో పరిష్కరించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలు వెళ్తారని, ఇక్కడ మౌళిక వసతులు కల్పించాలన్నారు.

ఖమ్మం జిల్లాలో విద్యార్థుల సంక్షే మం దిశగా కిచెన్ గార్డెన్‌ల ఏర్పాటు, మధ్యా హ్న భోజన నాణ్యత పెంపు, ఆంగ్ల పరిజ్ఞానం పెంపునకు వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్న కలెక్టర్‌ను అభినందించారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫార్స్ చేస్తామని తెలిపారు. గుట్కా, గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.

ఖమ్మం లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ముజామిల్‌ఖాన్, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్లు  శ్రీజ, శ్రీనివాసరెడ్డి, అదనపు డీసీపీ నరేశ్‌కుమార్, జిల్లా సంక్షేమ శాఖాధికారి సత్యనారాయణ పాల్గొన్నారు. కొత్తగూడెంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అదనపు కలెక్టర్ విద్యా చందన, రాష్ట్ర ఎస్సీ, ఎస్సీ కమిటీ సభ్యులు రాంబాబు నాయక్, నారాయణ, ప్రవీణ్ పాల్గొన్నారు.