calender_icon.png 22 January, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలి

01-09-2024 12:43:00 AM

నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి

గద్వాల(వనపర్తి), ఆగస్టు 31(విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వర గా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయ ం జరిగేలా చర్యలను తీసుకోవాలని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అధికారులను ఆదేశించారు. శనివారం ఐడీవోసీ కాన్ఫరెన్సు హాల్‌లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆ ధ్వర్యంలో జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరిం గ్ కమిటీ నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ సంతోష్, అలంపూర్ ఎమ్మెల్యే విజేయు డుతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రా జ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ప్రతి అధికారి ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీలు జరగకుండా బాధ్యతయుతంగా వ్య వహరించాలన్నారు. సమావేశంలో ఆర్టీవో రాంచందర్, డీఎస్పీ సత్యనారాయణ, ఇన్‌చార్జి బీసీ డెవలప్‌మెంట్ అధికారి సరోజమ్మ పాల్గొన్నారు.